Share News

Minister Uttam: ఆ ప్రాజెక్టుల పనులను త్వరగా చేపట్టాలి

ABN , Publish Date - Feb 22 , 2024 | 10:22 PM

ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీస్కొని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. గురువారం నాడు సచివాలయంలో సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ప్రాజెక్టులపై పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

 Minister Uttam: ఆ ప్రాజెక్టుల పనులను త్వరగా చేపట్టాలి

హైదరాబాద్: ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీస్కొని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. గురువారం నాడు సచివాలయంలో సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ప్రాజెక్టులపై పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 44 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులల్లో 9 కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉందన్నారు. సొరంగ మార్గంలో రెండు వైపులా పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని సంబంధిత ఏజెన్సీలు చెబుతున్నాయన్నారు. ఆ మేరకు టైం బౌండ్‌గా టార్గెట్ పెట్టుకొని పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులకు సంబంధించి అన్ని రకాల సమస్యలు, సాంకేతిక పనులు పూర్తి చేసేందుకు నిఫుణులైన అధికారుల బృందంతో కమిటీ వేయాలని నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

డిండి, పెండ్లి పాకాల జలాశయాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. 95 శాతం పనులు డిండి పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 90 కోట్ల రూపాయలు భూ సేకరణకు అవసరమని వివరించారు. పర్యావరణ, అటవీ అనుమతులు తెచ్చేందుకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వెంటనే ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. వ్యయం అయ్యే ప్రతి పైసా ప్రయోజనం చేకూరేలా చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం, కాలయాపన చేయడంతో ప్రాజెక్టులకు నష్టం జరిగిందన్నారు. రెండేళ్లలో డిండి, ఎస్.ఎల్.బి.సి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారానికోసారి సమీక్షలు చేస్తూ పనులను వేగవంతం చేయాలన్నారు. పనులల్లో ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే సంప్రదించి నివృత్తి చేసుకొని పనులు జరిగేలా చూడాలని చెప్పారు. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు వెంటనే తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 10:23 PM