Share News

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:57 AM

కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!
Harish Rao

సిద్ధిపేట, ఆగష్టు 17: కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


అసలేం జరిగింది..

సిద్ధిపేటలో అర్థరాత్ర ఫ్లె్క్సీ వార్ జరిగింది. అర్థరాత్రి హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సిద్ధిపేటలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘రూ. 2 లక్షల రుణమాఫీ అయింది. నీ రాజీనామా ఎటు పాయె.. అబద్ధాల హరీశ్ రావు’ అంటూ సిద్ధిపేట కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ పేరిట పట్టణంలో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.


ఫ్లెక్సీలను తొలగించాలని బీజేఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో జేఆర్ చౌరస్తాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆందోళనకు దిగాయి. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆందోళనలతో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం భారీగా మోహరించారు.


Also Read:

ఇంట్లో ఉన్న టోల్ ఫీజ్ కట్.. అసలేం జరిగిందంటే..

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్.. అందుబాటులో ఇవి మాత్రమే..

మనసు మార్చుకుందా?

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 17 , 2024 | 09:07 AM