Share News

Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు..

ABN , Publish Date - Sep 04 , 2024 | 01:47 PM

Telangana: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారన్నారు. ‘‘మమ్మల్ని గుర్తు పట్టనివారు మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు.

Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు..
MLA Vemula Veeresham

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారన్నారు. ‘‘మమ్మల్ని గుర్తు పట్టనివారు మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను పిలిచి విచారణ చేస్తానని స్పీకర్ చెప్పారు. దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇలా కావద్దు. పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను’’ అని ఎమ్మెల్యే తెలిపారు.

Dams: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..


ఆగష్టు 30 వ తేదిన జరిగిన సమావేశంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 94, 19 ప్రకారం తనను అవమానించినందుకు డీసీపీ, ఏసీపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రోటోకాల్ నిబంధనల్ని తుంగలో తొక్కడం సరికాదన్నారు. ‘‘నాపై మాత్రమే కాదు, ఏ ప్రజాప్రతినిధులపై ఇలా జరగకూడదు. గత ప్రభుత్వంలో అనేక హింసను, అవమానాలను ఎదుర్కున్నాం. అధికారులు కొందరు శత్రువుల ముందు మమ్మల్ని బలహీన పరిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ తప్పు చేసి కానిస్టేబుల్స్‌పై చర్యలు తీసుకుంటే ఎలా?’’ అంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ సంచలనం.. ఆ పార్టీలో చేరిక


అసలేం జరిగిందంటే...

కాగా.. నాలుగు రోజుక్రితం ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను పోలీసులు గుర్తుపట్టకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆగస్టు 30న భువనగిరికి వెళ్లారు. ఈ క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 30న భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వారంతా ప్రత్యేక హెలికాప్టర్‌లో భువనగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు.


అయితే వారికి స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లిన వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. పోలీసులకు కామన్‌ సెన్స్‌ ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా? అంటూ ఆగ్రహించారు. చివరకు తాను ఎమ్మెల్యేలను అని పోలీసులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. . ఈ అవమానంతో వీరేశం అక్కడి నుంచి అలిగి వెళ్లిపోవాలనుకున్నారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కలగజేసుకుని సముదాయించే ప్రయత్నించారు. నేతలు చెప్పినా వినకుండా అలకబూని అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి...

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

Virender Sehwag: నేను గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే.. ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో చెప్పిన సెహ్వాగ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 04 , 2024 | 04:10 PM