Share News

Weather: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ రెండు రోజులు జర భద్రం..

ABN , Publish Date - Sep 21 , 2024 | 02:33 PM

ఇటీవల ఓ నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆ వర్షం పోయి.. పది రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది.

Weather: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ రెండు రోజులు జర భద్రం..
Hyderabad Rain Alert

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇటీవల ఓ నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆ వర్షం పోయి.. పది రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం నాడు సాయంత్రం నగర వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అంతేకాదు.. రాబోయే రెండు రోజులు సైతం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. హైదరాబాద్, నగరం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.


శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ జలయమం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గన్‌ఫౌండ్రీలో 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 67.0, బేగంబజార్‌లో 62.8, నాచారంలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


అధికారులు అప్రమత్తం..

హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎస్‌డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులను సిద్ధం చేశారు. వర్షం కారణంగా నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.


Also Read:

తిరుమల లడ్డు.. మెగాబ్రదర్ సంచలన వ్యాఖ్యలు

బాబోయ్.. గోదావరి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్..

పేజర్ల పేలుళ్ల వెనుక కేరళ వాసి

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 21 , 2024 | 04:48 PM