Share News

Etela: వారిని వదిలిపెట్టి.. మాపై కేసులా

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:28 PM

Telangana: ఆలయాలపై దాడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ఈటల సూటిగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.

Etela: వారిని వదిలిపెట్టి.. మాపై కేసులా
MP Etela Rajender

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరుగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశామని ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడుల వెనుక ఎవరున్నారో బయటపెట్టలేదని.. ఎవరు ఎందుకు దాడి చేశారో చెప్పలేదన్నారు. ముత్యాలమ్మ ఆలయంలో దాడి చేసిన వారు పక్కనే హోటల్‌లో ఉన్నావారని స్థానికులు చెబుతున్నారన్నారు హిందువులు జరిపిన ర్యాలీలో బయటవారు కావాలని చేసిన పనికి భక్తులను చితకబాదారని మండిపడ్డారు. ప్రజలను కొట్టిన పోలీసులకే ప్రమోషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. దీంతో తమపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jaggareddy: నువ్వు బాయిలర్ కోడి.. మేము నాటు కోడి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్


బీజేపీ సమాజంలో శాంతిని కాంక్షిస్తోందని .. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయడంలేదని స్పష్టం చేశారు. సీఎంకు తమపై ఎందుకంత ద్వేశభావం కలిగి ఉన్నారని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చే‌సిన వారిని పట్టుకోరంటూ మండిపడ్డారు. సీఎంలను మార్చేందుకు మతకలహాలు సృష్టించిన నీచ చరిత్ర కాంగ్రెస్ ది అంటూ విరుచుకుపడ్డారు. మర్రి చెన్నారెడ్డిని దించాలని మతకలహాలు సృష్టించారని.. వందల మంది శవాలపై రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు అనేక ప్రాంతాల్లో బాంబులు పేలాయని గుర్తుచేశారు.

Viral Video: పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లనని వధువు మారాం.. ఆమె సోదరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేం..


మోదీ ప్రధాని అయిన అనంతరం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెబుతూ ఇలాంటి ఘటనల పీక నొక్కారన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో శాంతి నెలకొల్పిన పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎంఐఎం పార్టీ కోసం కాకుండా ప్రజాపాలనపై దృష్టి సారించాలని హితువుపలికారు. రక్తపాతాన్ని ఏ మత పెద్దలు ప్రోత్సహించరన్నారు. ఇప్పటికైనా తమపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ హయాంలో హక్కులను కాలరాశారని.. పోలీసులతో అణిచి వేస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Sanjay: జీవన్ రెడ్డి అనుచురుడి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా

Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. జలదిగ్బంధంలో ఐటీ సీటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 05:06 PM