Share News

Sanju Samson: రోహిత్‌ను గౌరవిస్తా.. కెప్టెన్సీలో ఆడలేదనే బాధ ఉంది

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:27 PM

దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావాలని పిలుపందినప్పుడు చాలా సంతోషించినట్టు సంజూ తెలిపాడు. కానీ ఆ కల చివరి వరకు నెరవేరకపోవడంపై ఈ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

Sanju Samson:   రోహిత్‌ను గౌరవిస్తా.. కెప్టెన్సీలో ఆడలేదనే బాధ ఉంది
Sanju Samson Rohit Sharma

ముంబై: టీ20 ప్రపంచకప్ ఫైనల్ జట్టులో ఉన్నప్పటికీ తనకు ఆడే చాన్స్ రాకపోవడానికి గల కారణాన్ని వికెట్ కీపర్ సంజూ శాంసన్ తాజాగా వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావాలని పిలుపందినప్పుడు చాలా సంతోషించినట్టు సంజూ తెలిపాడు. కానీ ఆ కల చివరి వరకు నెరవేరకపోవడంపై ఈ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.


రోహిత్ మాటల వల్లే తేలికపడ్డా

’మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని, పాత టీం తోనే టీమిండియా బరిలోకి దిగనుందని కెప్టెన్ రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్లిపోయాడు. మరో పది సెకన్ల తర్వాత వెనక్కి వచ్చి.. నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు మనసులోనే నన్ను తిట్టుకుంటున్నావు కదా అని అన్నాడు. అప్పుడు నేను ముందు మ్యాచ్ గెలుద్దాం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను. నన్ను ఆటలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను రోహిత్ పది నిమిషాల పాటు వివరించాడు. నిజానికి అంత కీలకమైన మ్యాచ్ కు ముందు జట్టు ప్రయోజనాల మీదనే కెప్టెన్ ఫోకస్ ఉంటుంది. టీం లో ఉన్న వారి ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన సమయం వారికి ఉండదు. కానీ, రోహిత్ నా విషయంలో చూపించిన చొరవ.. టైం లేకపోయినా నాకోసం వ్యక్తిగతంగా రావడం వంటివి నన్నెంతో కదిలించాయి. జట్టు కెప్టెన్ గా రోహిత్ ను ననెంతో గౌరవిస్తాను. కానీ, అతని కెప్టెన్సీలో ఆడలేకపోయాననే బాధ మాత్రం నాలో ఇంకా ఉంది అంటూ సంజూ వివరించాడు.


ఐపీఎల్‌లో డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ శాంస‌న్‌కు ఎక్కువ అవ‌కాశాలు రాక‌పోవ‌డం పై అత‌డి అభిమానులు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉన్నారు. జ‌ట్టులో త‌న‌కు చోటు దక్కకున్నా ఎప్పుడు కూడా శాంస‌న్ ఫిర్యాదులు చేయలేదు. త‌న హార్డ్ వ‌ర్క్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. మొత్తానికి టీ20 ప్రపంచకప్ ఫైనల్ కి చోటు దక్కించుకన్నాడని అనుకునేలోపే జట్టులో మార్పులు చేయాలనుకునే నిర్ణయాన్ని టీమిండియా మార్చుకుంది.

CWC 2026: కామన్ వెల్త్ లో క్రీడల తొలగింపు.. భారత్ కే ఎక్కువ లాస్

Updated Date - Oct 22 , 2024 | 04:47 PM