Share News

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..

ABN , Publish Date - Jul 14 , 2024 | 09:30 PM

ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాపర్ల చెర నుంచి ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీసులు కాపాడారు. మూడ్రోజుల క్రితం బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన ల్యాండ్ మాఫియా రెండ్రోజులుగా శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మెుత్తం ఏడుగురు కిడ్నాపర్లలో నలుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..
Rajendranagar DCP Srinivas

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాపర్ల చెర నుంచి ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీసులు కాపాడారు. మూడ్రోజుల క్రితం బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన ల్యాండ్ మాఫియా రెండ్రోజులుగా శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మెుత్తం ఏడుగురు కిడ్నాపర్లలో నలుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. బాధితుణ్ని ఫామ్ హౌస్ కిచెన్ రూమ్‌లో పెట్టి 20కుక్కల్ని వదిలిపెట్టి తీవ్రంగా హింసించారని డీసీపీ చెప్పారు. ఆ ఫామ్ హౌస్ సైతం అక్రమంగా నిర్మించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.


ఫామ్ హౌస్‌లో వివిధ రకాల జాతుల కుక్కలు, గుర్రాలు, పొట్టేళ్లను నిర్వాహకులు బంధించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వీటంన్నింటినీ పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని వివరాలు సేకరిస్తున్నామని, భూ యజమానికి కూడా తెలియకుండా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని చెప్పారు. స్థలం వివాదం కోర్టులో నడుస్తుండగా ఇంజక్షన్ ఆర్డర్ నకిలీ పత్రాన్ని పొంది కిడ్నాపర్లు మీర్స్ బ్రదర్స్ ఫార్మ్ హౌస్ నిర్మించారని డీసీపీ శ్రీనివాస్ వివరించారు. ల్యాండ్ యజమాని ఫిర్యాదు మేరకు మరో కేసు వారిపై నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు.


అసలేందుకు కిడ్నాప్ చేశారంటే..

గండిపేటలో ఓ వైద్యురాలికి చెందిన 2,000గజాల భూమిని గత కొద్దిరోజుల క్రితం ల్యాండ్ మాఫియా కబ్జా చేసింది. దీని విలువ సుమారు రూ.20కోట్లు ఉంటుంది. వైద్యురాలి సంతకాని ఫోర్జరీ చేసిన ఆ గ్యాంగ్ సభ్యులు.. ఏపీకి చెందిన వ్యక్తికి రూ.3కోట్లకు దాన్ని అమ్మేశారు. మూడ్రోజుల క్రితం స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి.. ఎమ్మార్పీఎస్ నేత నరేందర్, మరొక వ్యక్తిని సంప్రదించి స్థలంలోని పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మరో ల్యాండ్ మాఫియా గ్యాంగ్ నరేందర్‌ను కిడ్నాప్ చేసి శంషాబాద్‌కు తీసుకెళ్లారు.


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజులుగా శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌లో బాధితుణ్ని నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు నార్సింగి పోలీసులు నిన్న(శనివారం) గుర్తించారు. ఫామ్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు బాధితుణ్ని కాపాడారు. కుక్కలను సైతం కాపలాగా పెట్టి నరేందర్ హింసించినట్లు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 09:31 PM