Share News

Hyderabad City: పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Aug 16 , 2024 | 06:59 PM

వర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలోని.. తరచూ చెత్త వేసే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు సైతం దాన కిషోర్ పరిశీలించారు.

Hyderabad City: పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌ మహానగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత జర్నిలిస్టు కాలనీలోని పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని రహదారులపై ప్యాచ్ వర్క్స్ పూర్తి చేయకుండా వదిలేసిన గుంతలను పరిశీలించి స్థానిక అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

dana-kishore5.jpg

ఏ పనులు చేపట్టినా.. ఎప్పటికప్పుడు రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని వారికి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్‌ను గుర్తించి సంపు నిర్మించాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.

danakihore-0.jpg


అంటు వ్యాధులు ప్రబలే అవకాశం..

వర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలోని.. తరచూ చెత్త వేసే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు సైతం ఆయన పరిశీలించారు.

dana-kishore-with-workers.jpg

అక్కడ విధులు నిర్వహిస్తున్న SFA, పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. అలాగే వారి సమస్యల్ని సైతం ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా జరుగుతున్న పనులపై వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

danakishore01.jpg


అధికారులకు కీలక ఆదేశాలు..

పారిశుద్ధ్య కార్మికుల హాజరు తదితర వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలుంటే.. ఉన్నతాధికారులకు తెలియజేయాలని వారికి సూచించారు. పని సమయాల్లో కార్మికులు తప్పనిసరిగా యూనిఫాం, హ్యాండ్ గ్లౌజ్ ధరించి.. రక్షణ చర్యలు పాటించాలన్నారు. అలాగే నగరంలో చెత్త ఎక్కువగా ఉత్పన్నమయ్యే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు ఈ సందర్భంగా దానకిషోర్ సూచించారు. అలాంటి ప్రాంతాల్లో రెండు షిఫ్టులో చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

dana-kishore-2.jpg


సంపు పనులు పరిశీలించిన దాన కిషోర్..

అనంతరం.. పలు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి నిల్వ సంపుల పనుల్ని ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్లలో సంపుల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. మొత్తం 140 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండగా.. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అనువైన స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది.

dana-kishore3.jpg

అందులో భాగంగా ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ. 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులు నిర్మిస్తారు. వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి.. అనంతరం సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం వీటి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ్ కుమార్, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 07:01 PM