Share News

TG News: ఈరోజు మధ్యాహ్నం జడ్జి ముందుకు నరేందర్

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:00 PM

Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు.

TG News: ఈరోజు మధ్యాహ్నం జడ్జి ముందుకు నరేందర్
Municipal Revenue Officer Narender

నిజామాబాద్, ఆగస్టు 10: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు. కాగా... నిజామాబాద్‌లోని నరేందర్ ఇళ్ళల్లో నిన్న(శుక్రవారం) సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. నరేందర్‌ బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Duvvada Sreenivas: వాణి, మాధురీ వ్యవహారంపై దువ్వాడ ప్రెస్‌మీట్


నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్‌లో తనిఖీలు చేపట్టారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు చేశారు. నరేందర్ నివాసంలో రూ.2.93కోట్ల నగదు, 51తులాల బంగారు ఆభరణాలు, రూ.1.98 కోట్ల విలువైన 17స్థిరాస్తుల దస్త్రాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.10కోట్లు గుర్తించారు. ఒక సూపరింటెండెంట్ ఇంట్లో ఇంత పెద్ద మెుత్తంలో ఆస్తులు గుర్తించడంతో ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?


నేడు నరేందర్ బ్యాంక్ లాకర్లను అధికారులు తెరవనున్నారు. దీంతో ఇంకెంత ఆస్తి బయటపడుతుందో అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బంగారం, స్థిర, చర ఆస్తులు కలిపి మెుత్తం రూ.6.07కోట్లను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అయితే ఇతర స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయా అని విచారణ చేపట్టగా.. నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్రలో మరికొన్నింటిని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌లోని అతని నివాసం ఏసీబీ అధీనంలో ఉంది. కారుణ్య నియామకం ద్వారా బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నరేందర్.. ప్రమోషన్లతో ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్నారు.


ఇవి కూడా చదవండి...

TG Police: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 12:03 PM