Nara Bhuvaneshwari: డిజిటల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:07 PM
Telangana: ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో డిజిటల్ క్యాలెండర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఉదయం ఆశిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 1: ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో డిజిటల్ క్యాలెండర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సోమవారం ఉదయం ఆశిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి తమకు అండగా నిలబడ్డారన్నారు. చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు తన మనస్సులో ఎప్పటకీ ఉండిపోతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..