Share News

TS News: ఫ్రెండ్స్‌‌కు ఉద్యోగ స్థలం చూపిస్తానంటూ వచ్చి... జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:51 AM

Telangana: రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రుత్విక్‌రెడ్డిగా గుర్తించారు. ఇటీవలే రుత్విక్‌రెడ్డికి అమేజాన్‌లో ఉద్యోగం వచ్చింది.

TS News: ఫ్రెండ్స్‌‌కు ఉద్యోగ స్థలం చూపిస్తానంటూ వచ్చి... జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్, జనవరి 25: రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రుత్విక్‌రెడ్డిగా గుర్తించారు. ఇటీవలే రుత్విక్‌రెడ్డికి అమేజాన్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో తాను పనిచేసే స్థలాన్ని చూపిస్తానంటూ ఫ్రెండ్స్‌ను కారులో రుత్విక్ రెడ్డి తీసుకెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో మద్యం సేవించిన రుత్విక్.. ఆపై తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో స్నేహితులకు తాను పనిచేసే ఆఫీస్‌‌ను చూపించాడు. ఆ తరువాత మాదాపూర్‌లో బిర్యానీ తిన్న రుత్విక్.. తిరిగి వస్తున్న సమయంలో పెద్దమ్మ గుడి సమీపంలో కారుతో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తారక్ అనే బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం ఐదుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువతి, నలుగురు యువకులు ఉన్నారు.


ప్రమాద వివరాలు...

నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మగుడి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు ఆపకుండానే సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు ఢీకొనడంతో బైక్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు నగరానికి చెందిన తారక్‌(27)గా గుర్తించారు. ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న తారక్.. బుధవారం విధులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తారక్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహం జరుగగా.. అతడికి 11 నెలల బాబు ఉన్నాడు. తారక్‌ మృతి వార్త తెలిసి భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు తారక్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే గత రాత్రి పదిగంటల వరకు తారక్ డెడ్ బాడీతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బంధవులు ఆందోళనకు దిగారు. కారు నడిపిన నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో కుటుంబభ్యులు ఆందోళన విరమించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 25 , 2024 | 12:04 PM