Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
ABN , Publish Date - Jan 11 , 2024 | 08:16 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ( Niranjan Reddy ) తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ( Niranjan Reddy ) తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... ధాన్యం సేకరించిన 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రైతు బంధు అందరికీ వచ్చిందని డిప్యూటీ సీఎం చెబుతున్నారన్నారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారన్నారు. స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైతు రుణమాఫీ చేయలేదని చెప్పారు. క్రిష్ణా బేసిన్‌లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లు ఉన్నాయన్నారు. రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా...? ఇవ్వదా...? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలను తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. మిర్చి క్రయ, విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా ఇచ్చిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.