Allu Arjun: బన్నిని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా..
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:07 PM
మొదట అల్లు అర్జున్‌కు 18 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప 2 మూవీ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న ఆయనను ఏసీపీ రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (సీఐ) రాజు విచారిస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌కు 20 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అల్లు అర్జున్‌ను కింది పేర్కొన్న ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ షాక్ అయినట్లు సమాచారం. తనకు పోలీసులు రేవతి చనిపోయిన విషయాన్ని డిసెంబర్ 4వ తేదీ రాత్రి చెప్పలేదని మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పగా.. నేరుగా అల్లు అర్జున్‌కు రేవతి మరణ వార్త తెలియజేశానని చెబుతున్న ఏసీపీ రమేష్ బన్నిని ప్రశ్నించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు సమాచారం. మొదట అల్లు అర్జున్ విచారణకు హాజరుకాగానే ఎలా ఉన్నావ్ అని పలకరించిన పోలీసులు తరువాత తమ ప్రశ్నలతో బన్నిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్‌తో పాటు లీగల్ టీమ్, అల్లు అరవింద్, చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. వాళ్లు ఒక గదిలో కూర్చోగా.. మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు నుంచి మూడు గంటల పాటు విచారణ సాగనుంది. ఒకవేళ సాయంత్రం వరకు విచారణ జరిగితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.
అల్లు అర్జున్‌ను అడిగే ప్రశ్నలు..
1. సంధ్య థియేటర్‌కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు
2. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు
3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా.. లేదా?
4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
5. మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు
6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
11. అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్లు ఎవరు?
12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
13. పోలీసులు చెప్పినా.. వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు?
14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here