Share News

Crime: చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..

ABN , Publish Date - Jun 24 , 2024 | 10:56 AM

హైదరాబాద్: చైన్ స్నాచర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గాల్లోకి కాల్పులు జరిపారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నాచర్‌ను పట్టుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.

Crime:  చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..

హైదరాబాద్: చైన్ స్నాచర్లపై (Chain Snatchers) హైదరాబాద్ (Hyderabad) పోలీసులు (Police) ఉక్కు పాదం మోపుతున్నారు. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు (Fire into the Air) జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గాల్లోకి కాల్పులు జరిపారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నాచర్‌ను పట్టుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. సైదాబాద్ (Saidabad) పీఎస్ లిమిట్స్ శంఖేశ్వర్ బజార్‌ (Shankeshwar Bazar)లో చైన్ స్నాచర్ సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే శంకేశ్వర్ బజార్‌కు యాంటీ డేకాయిటీ టీమ్ పోలీసులు చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న చైన్ స్నాచర్ అమీర్‌‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను ప్రతిఘటించి పోలీసులపై ఎదురు దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. చైన్ స్నాచర్‌ను వదలకుండా పోలీసులు వెంబడించారు. హెచ్చరికగా ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి చైన్ స్నాచర్ అమీర్‌ను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం

జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?

ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 24 , 2024 | 10:58 AM