Hyderabad: కేసీఆర్ లేఖపై స్పందించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:09 PM
విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహా రెడ్డి.. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు.
హైదరాబాద్, జూన్ 16: విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహా రెడ్డి.. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. లీగల్ అంశాలను సైతం లీగల్ టీమ్ పరిశీలించాలని పవర్ కమిషన్ చీప్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
లేఖ అంశంపై మీడియాతో మాట్లాడిన జస్టిస్ నరసింహా రెడ్డి.. కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందన్నారు. కేసీఆర్ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారన్నారు. ఛత్తీస్‌గఢ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందన్నారు. లెటర్‌లో కేసీఆర్ చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నారు.
కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పునఃపరిశీలన జరుపుతామని జస్టిస్ నరసింహా రెడ్డి అన్నారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియా ముందు వివరించానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజం అన్నారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు, వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని చెప్పారు. వాస్తవాలు ఏంటనేదానిపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ పంపిన లెటర్‌పై మంగళవారం నాడు విశ్లేషణ జరుపుతామని.. దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు.