Share News

Prashantreddy: విద్యుత్ కమిషన్ చైర్మెన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:36 PM

Telangana: విద్యుత్ కమిషన్ చైర్మెన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వాఖ్యలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కాకముందే ప్రెస్స్ మీట‌లు పెట్టి చెప్పటం తప్పు అని చెప్పిందన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటంపైన తీవ్రంగా తప్పుబట్టడం...

Prashantreddy: విద్యుత్ కమిషన్ చైర్మెన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం
Former minister Prashanth Reddy

హైదరాబాద్, జూలై 16: విద్యుత్ కమిషన్ చైర్మెన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (Supreme Chief Justice ) చేసిన వాఖ్యలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Former Minister Prashanth Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కాకముందే ప్రెస్స్ మీట‌లు పెట్టి చెప్పటం తప్పు అని చెప్పిందన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటంపైన తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంటే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..


రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ జరుగుతోందన్నారు. విద్యుత్ కొనుగోళ్లు అప్పటి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలే అని... అన్ని సక్రమంగానే జరిగాయి.. కానీ అవేవీ పట్టించు కోకుండ ఛైర్మెన్ ఇష్టానుసారంగా మీడియాకు వివరాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా కేసీఆర్‌ను(BRS Chief KCR) ఇలా ఇరికించాలని చూశారన్నారు. అందుకే సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు. తెలంగాణ సాధనే కరెంటు కోసమన్నారు. బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ అనేక ప్రణాళికలు చేశారన్నారు. కరెంట్ ఇచ్చి పరిశ్రమలు కాపాడాలని కేసీఆర్ బలమైన దీక్షతో కరెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ ఇస్తే దేశ వ్యాప్తంగా కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని బురద జల్లడానికి చిల్లర ప్రయత్నం చేశారని... కానీ ప్రభుత్వానికి రివర్స్ అయ్యిందని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 03:40 PM