Share News

Crime news: నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్..

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:49 AM

సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో బైక్ రేసింగ్(Bike Racing) చేస్తున్న వారిపై పోలీసులు కొరడ ఝుళిపించారు. రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్‌చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు(Raidurgam police) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Crime news: నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్..

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో బైక్ రేసింగ్(Bike Racing) చేస్తున్న వారిపై పోలీసులు కొరడ ఝుళిపించారు. రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్‌చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు(Raidurgam police) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంతకాలంగా రాత్రిళ్లు రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారన్న సమాచారంతో డ్రైవ్ చేపట్టారు.


బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న 50ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఐపీసీ 336, 341, మోటార్ వెహికిల్ చట్టం 184సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన వాహనాలకు ఆర్టీవోకి అప్పగించారు. బైకర్లను కోర్టు ఎదుట హజరు పరిచారు. కమిషనరేట్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు అసౌర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని, రాత్రిళ్లు వారికి వాహనాలు ఇచ్చి బయటకు పంపొద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 11:49 AM