Share News

TS News: ఇవాళ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

ABN , Publish Date - Feb 08 , 2024 | 09:44 AM

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉండనుంది.

TS News: ఇవాళ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉండనుంది. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

20న నామినేషన్ల విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించనుంది. తెలంగాణలో ఉన్న మూడు స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్‌కు, ఒకటికి ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేస్తే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మూడు కన్నా ఎక్కువ నామినేషన్లు పడితే ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫలితాలు సైతం అదే రోజున వెలువడనున్నాయి.

Updated Date - Feb 08 , 2024 | 09:44 AM