Share News

Ramoji Rao: రామోజీరావు చివరి వీడ్కోలుకు ఏర్పాట్లు పూర్తి..

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:46 AM

రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

Ramoji Rao: రామోజీరావు చివరి వీడ్కోలుకు ఏర్పాట్లు పూర్తి..

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు నిన్న (జూన్ 8న) ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ్నుంచే ఏర్పాట్లకు ఆదేశించారు. రామోజీ మృతికి నివాళిగా ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులపాటు (ఆది, సోమవారాలు) సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తూ చలనచిత్ర నిర్మాతల మండలి సైతం బంద్‌కు పిలుపునిచ్చింది.


సందర్శనార్థం ప్రముఖులు పెద్దఎత్తున తరలివస్తుండడంతో అంత్యక్రియల వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం ఎదుట ఖాళీ ప్రదేశంలో భౌతికకాయాన్ని ఉంచారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా ఆయనకు అస్వస్థత ఉండడం.. బీపీ నియంత్రణలో లేకపోవడంతో ఈనెల 5న ఆయన్ని హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో స్టెంట్ వేశారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్సపొందుతూ నిన్న (జూన్ 8న) తెల్లవారుజామున మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:

AP Politics: గుడివాడలో మాజీ ఎమ్మెల్యే నానికి జలక్.. రూ.100కోట్ల విలువైన భూమి స్వాధీనం..

For more Andhrapradesh News and Telugu News..

Updated Date - Jun 09 , 2024 | 08:46 AM