Home » Ramoji Group
భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యాలయాల్లో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఏపీ పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి
బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో..
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.