Share News

Good News: మందుబాబులకు బంపర్ ఆఫర్.. పది తర్వాత పూర్తి ఫ్రీ..

ABN , Publish Date - Dec 31 , 2024 | 09:01 AM

డిసెంబర్ 31 వచ్చిందంటే వైన్‌షాపులకు భలే గిరాకీ ఉంటుంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల్లో జనం బిజీగా ఉంటారు. మద్యం ప్రియులకు మాత్రం ఏడాది ఆఖరి రోజు పండుగలాంటి రోజనే చెప్పుకోవాలి. చాలామంది పార్టీలకు వెళ్లి ఫుల్‌గా మద్యం తాగి ఇళ్లకు వెళ్తుంటారు. అందుకే హైదరాబాద్ సిటీలో మద్యం ప్రియులకు తెలంగాణ..

Good News: మందుబాబులకు బంపర్ ఆఫర్.. పది తర్వాత పూర్తి ఫ్రీ..
Free Cab Service

డిసెంబర్ 31 వచ్చిందంటే వైన్‌షాపులకు భలే గిరాకీ ఉంటుంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల్లో జనం బిజీగా ఉంటారు. మద్యం ప్రియులకు మాత్రం ఏడాది ఆఖరి రోజు పండుగలాంటి రోజనే చెప్పుకోవాలి. చాలామంది పార్టీలకు వెళ్లి ఫుల్‌గా మద్యం తాగి ఇళ్లకు వెళ్తుంటారు. కొందరు తమ సొంత వాహనాల్లోనే ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంలో అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్‌కేసులో దొరికే అవకాశం లేకపోలేదు. అందుకే హైదరాబాద్ సిటీలో మద్యం ప్రియులకు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31(మంగళవారం) రాత్రి పది గంటల నుంచి ఒంటి గంటవరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఉచిత ప్రయాణం కోసం 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఎటువంటి ఛార్జీ లేకుండా సురక్షితంగా మద్యం తాగిన వ్యక్తులను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు ఈ సర్వీస్ దోహదపడుతుందన్నారు. నగరం పరిధిలో మాత్రమే ఈసేవలు అందుబాటులో ఉంటాయన్నారు.


పూర్తిగా ఉచితం..

సాధారణంగా క్యాబ్ సర్వీస్ సంస్థలు తమ కస్టమర్ల కోసం ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. తమ సర్వీసులకు డిమాండ్ పెరగడం కోసం డిసెంబర్ 31 లేదా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రతి రైడ్‌పై భారీ తగ్గింపులు ప్రకటిస్తుంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లే వ్యక్తులు ఎక్కువుగా ప్రయివేట్ క్యాబ్ సర్వీసులను ఉపయోగిస్తారు. కానీ కొందరు మద్యం తాగి సొంత వాహనాలను నడిపే ప్రయత్నం చేస్తారు. ఈ విధానం అత్యంత డేంజర్ కావడంతో.. మద్యం తాగి ఇళ్లకు వెళ్లాలనుకునేవారికి తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తున్నారు. ఈ సేవలు ఉపయోగించుకున్నందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఫికప్, డ్రాప్ లోకేషన్ చెబితే వాళ్లే వచ్చి మిమల్ని కారు లేదా బైక్‌పై తీసుకెళ్తారు.


ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఉచిత క్యాబ్ సర్వీస్ ఇస్తున్నారు సరే.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలనే అనుమానం చాలామందికి రావొచ్చు. ఎవరైనా ఉచిత క్యాబ్ సర్వీస్ ఉపయోగించుకోవాలనుకుంటే 9177624678 నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీ ఫికప్, డ్రాప్ లోకేషన్ చెబితే మీ పేరుపై క్యాబ్ బుక్ చేసి వాహనాన్ని పంపిస్తారు. ఒక వ్యక్తి ఉంటే బైక్ ట్యాక్సీ, ఇద్దరు కంటే ఎక్కువ మంది సమూహంగా ఉంటే కారును పంపిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

Updated Date - Dec 31 , 2024 | 09:02 AM