Share News

Scientist: అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు.. ప్రముఖుల సంతాపం

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:31 AM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణుల్లో ఒకటైన భారత అగ్ని క్షిపణి పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ DRDO క్షిపణి శాస్త్రవేత్త రామ్ నరైన్ అగర్వాల్(Ram Narain Agarwal) గురువారం కన్నుమూశారు. రామ్ నరైన్ అగర్వాల్ 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.

Scientist: అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు.. ప్రముఖుల సంతాపం
Scientist Agni Missile Mission man

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణుల్లో ఒకటైన భారత అగ్ని క్షిపణి పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ DRDO క్షిపణి శాస్త్రవేత్త రామ్ నరైన్ అగర్వాల్(Ram Narain Agarwal) గురువారం కన్నుమూశారు. రామ్ నరైన్ అగర్వాల్ 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. అగర్వాల్ గత కొన్నిరోజులుగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి హైదరాబాద్(hyderabad) సంతోష్ నగర్‌లోని స్వగృహంలో మృతి చెందారు. అగర్వాల్ స్వస్థలం రాజస్తాన్ జైపూర్ కాగా, ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నేడు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


కీలక పాత్ర

భారత సైన్యాన్ని శక్తివంతం చేసిన శాస్త్రవేత్త రామ్ నరైన్ అగర్వాల్ గురించి ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం. DRDO అధికారి ప్రకారం DRDO శాస్త్రవేత్త రామ్ నరైన్ అగర్వాల్ భారతదేశాన్ని ప్రధాన క్షిపణి శక్తిగా మార్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. భారతదేశం దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో అగర్వాల్ క్రియాశీలకంగా పనిచేశారు. అందుకే అగ్ని క్షిపణుల మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్‌ని అగ్ని క్షిపణి పితామహుడిగా పిలుస్తున్నారు. రామ్ నరైన్ చేసిన సేవలకు గాను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు.


ప్రముఖల సంతాపం

రామ్ నరైన్ అగర్వాల్ మృతి పట్ల డీఆర్‌డీఓ సీనియర్ మాజీ శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామ్ నరైన్ అగర్వాల్ మృతితో భారతదేశం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని డీఆర్‌డీఓ మాజీ చీఫ్, శాస్త్రవేత్త డాక్టర్ జీ సతీష్ రెడ్డి అన్నారు. దేశంలో సుదూర క్షిపణి తయారీ ప్రయోగ సౌకర్యాలను విస్తరించడంలో అగర్వాల్ ముఖ్యమైన పాత్ర పోషించారని ఆయన అన్నారు.


అగ్ని క్షిపణి

DRDO తయారు చేసిన అగ్ని క్షిపణి భారతదేశ అణు ప్రయోగ సామర్థ్యానికి వెన్నెముకగా పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు ఐదు రకాల అగ్ని క్షిపణిలను విజయవంతంగా పరీక్షించారు. క్షిపణి సాంకేతికత రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా అగ్ని 1 - 700-800 కిమీ, అగ్ని 2 - 2000 కిమీ కంటే ఎక్కువ, అగ్ని 3 - 2500 కిమీ కంటే ఎక్కువ, అగ్ని 4 - 3500 కిమీ కంటే ఎక్కువ, అగ్ని 5 - 5000 కిమీ కంటే ఎక్కువ.


ఇవి కూడా చదవండి:

Rain Alert: 25 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. 3 నెలల్లో విధ్వంసం..

Congress : రాహుల్‌కు ఐదో వరుసలో సీటు

PM Modi : లౌకిక పౌరస్మృతి

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 09:50 AM