Share News

Drugs Case: ఓరి బాబోయ్.. ‘పుష్ప’ను మించిపోయారు.. జైలు నుంచే డ్రగ్స్ సప్లై!

ABN , Publish Date - Feb 29 , 2024 | 08:59 AM

డ్రగ్స్ కేసు మూలాలు వెదికేందుకు నార్కోటిక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంతం చేశారు. టీఎస్ న్యాబ్ విచారణలో కీలక సమాచారాన్ని స్టాన్‌లీ వెల్లడించాడని తెలుస్తోంది. ఇటీవలే 8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్ లీ పట్టుబడ్డాడు. గోవా కోల్వలే జైలు నుంచే స్టాన్ లీకి ఓక్రా ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్టు టీఎస్ న్యాబ్ గుర్తించింది.

Drugs Case: ఓరి బాబోయ్.. ‘పుష్ప’ను మించిపోయారు.. జైలు నుంచే డ్రగ్స్ సప్లై!

హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు (Drugs case) మూలాలు వెదికేందుకు నార్కోటిక్ (Narcotic) అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంతం చేశారు. టీఎస్ న్యాబ్ విచారణలో కీలక సమాచారాన్ని స్టాన్‌లీ వెల్లడించాడని తెలుస్తోంది. ఇటీవలే 8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్ లీ పట్టుబడ్డాడు. గోవా (Goa) కోల్వలే జైలు నుంచే స్టాన్ లీకి ఓక్రా ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్టు టీఎస్ న్యాబ్ గుర్తించింది. కోర్టు అనుమతితో నార్కోటిక్ బృందం గోవాకి వెళ్లింది.

జైలులో ఉన్న ఓక్రాతో పాటు ఫైజల్‌ను విచారించి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం నార్కోటిక్ బ్యూరో చేస్తోంది. ఓక్రా, ఫైజల్ గోవా జైలులో ఉండి సెల్‌ఫోన్స్ ద్వారా యూరప్ దేశాల నుంచి వివిధ రకాల డ్రగ్స్‌ను ముంబైకి తెచ్చి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్టు గుర్తించింది. ఓక్రా, ఫైజల్ ఇద్దరూ జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నట్టు గోవా పోలీసులకు నార్కోటిక్ అధికారులు సమాచారం ఇచ్చారు. గోవా కొల్వాలే జైల్లో తనిఖీలు చేసిన గోవా పోలీసులు16 సెల్ ఫోన్లను గుర్తించారు. ఓక్రా, ఫైజల్‌ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే మరింత సమాచారం వస్తుందని నార్కోటిక్స్ బ్యూరో భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 10:47 AM