Share News

Drugs: హైదరాబాద్ కేవ్ పబ్‌లో డ్రగ్స్ కలకలం..

ABN , Publish Date - Jul 07 , 2024 | 07:12 PM

నగరంలోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పటికే పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో జూబ్లీహిల్స్(Jubilee Hills) సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కేవ్ పబ్‌(Cave Pub)పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్, గంజాయిని గుర్తించారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్ఓటీ(SOT), టీజీ న్యాబ్(TG NAB) అధికారులు.. మత్తుపదార్థాలు సేవించిన 24మందిని అదుపులోకి తీసుకున్నారు.

Drugs: హైదరాబాద్ కేవ్ పబ్‌లో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్: నగరంలోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పటికే పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో జూబ్లీహిల్స్(Jubilee Hills) సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కేవ్ పబ్‌(Cave Pub)పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్, గంజాయిని గుర్తించారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్ఓటీ(SOT), టీజీ న్యాబ్(TG NAB) అధికారులు.. మత్తుపదార్థాలు సేవించిన 24మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. మెుత్తం 55మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 24మందికి పాజిటివ్ తేలిందని మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్పారు.


కేవ్ పబ్‌లో పని చేసే అబ్దుల్ అయూబ్ అనే డీజే కూడా మత్తుపదార్థాలు సేవించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మేనేజర్ ఆర్.శేఖర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. 24మంది కూడా పబ్ బయటే మత్తుపదార్థాలు తీసుకుని లోపలికి వచ్చారని, విచారణ అనంతరం పబ్‌ను మూసివేస్తామని ఆయన తెలిపారు. పబ్ యజమానులు నలుగురినీ త్వరలో అదుపులోకి తీసుకుంటామని, గతంలోనూ ఈ తరహా పార్టీలు ఇక్కడ జరిగాయనే అనుమానాలు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. పబ్ ఓనర్స్‌ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని చెప్పారు. తరచుగా అన్నీ పబ్బుల్లో తనిఖీలు చేస్తున్నామని.. డ్రగ్స్ సరఫరా చేసినా, ఎవరైనా వాటిని సేవించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెజాన్, టీసీఎస్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు డ్రగ్స్ వినియోగించకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని డీసీపీ వినీత్ సూచించారు.

Updated Date - Jul 07 , 2024 | 07:20 PM