Share News

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

ABN , Publish Date - Oct 21 , 2024 | 09:39 AM

Telangana: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే
Telangana Ministers

సియోల్ - దక్షిణ కొరియా, అక్టోబర్ 21: దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణ మంత్రులు (Telangana Ministers), అధికారుల బృందం బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్


మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ , మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..


కాగా.. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావించింది. ఖాళీ చేసిన నివాసాల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ విభాగాలు.. మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్వాసితులను ఒప్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉన్నతస్థాయి ఆదేశాల నేపథ్యంలో వేచి చూస్తున్నాయి. ప్రాజెక్టులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తొలినుంచి యోచిస్తున్న సర్కారు వారిని దక్షిణ కొరియా తీసుకెళ్లాలని నిర్ణయించింది. సుందరకీరణ తర్వాత నది రూపు ఎలా మారనుందో అవగాహన కల్పించేందుకు అధ్యయనానికి తీసుకెళ్లనుంది. 21 మందితో కూడిన బృందం పర్యటనకు ఇటీవల సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఉన్నతాధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లింది. అక్కడి చాంగి చియోన్‌లో హన్‌ నది, సియోల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి 25వ తేదీన స్వదేశానికి రానుంది. గతంలో నది, తీరం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారాయో ప్రజాప్రతినిధులకు చూపించనున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి...

Attack on TDP Activists: ఆ జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు, వరస దాడులు..

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 10:02 AM