TS Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 10:21 AM
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు (గురువారం) స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ... సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. బ్రేక్ టైంలో మాత్రమే మీడియా పాయింట్‌లో సభ్యులు మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు.
కాగా.. ఈరోజు శాసనసభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఈరోజు సభలో కుల గణన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను సర్కార్ ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీ రాజ్ రిపోర్ట్‌లను సర్కార్ టేబుల్ చేయనుంది. అసెంబ్లీలో ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేయనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..