Share News

Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:49 PM

Telangana: తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్‌లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది. స్కీల్ యూనివర్సీటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలేండర్, రైతు భరోసా విధివిధానాలతో పాటు లీగల్ డిపార్ట్‌మెంట్‌లో పలు పేర్ల...

Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ
Telangana Cabinet

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్‌లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది. స్కీల్ యూనివర్సీటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలేండర్, రైతు భరోసా విధివిధానాలతో పాటు లీగల్ డిపార్ట్‌మెంట్‌లో పలు పేర్ల మార్పులపై కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పోరేషన్‌లో విలీనంపైనా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

CM Revanth: కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్


వర్గీకరణపై రేవంత్...

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

Chinta mohan: ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్


బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్...

కాగా... తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని ఇవాల్టి వరకూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారింది. బుధవారం నాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మహిళ అని చూడకుండా నిండు సభలో కించపరిచారని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు సమావేశాలకు వెళ్లకుండా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ఎంట్రెన్స్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరిని మార్షల్స్ బలవంతంగా బయటికి ఎత్తుకొచ్చారు. స్పీకర్ ఎంట్రెన్స్ ముందే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్, సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలించారు. అయితే బీఆర్‌ఎస్ మహిళ సభ్యులను నిండు సభలో అవమానించారని.. అందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు.


ఇవి కూడా చదవండి...

KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...

Wayanad Landslides: వయనాడ్ విలయానికి కారణమదే.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 03:51 PM