Share News

Revanth Reddy: చరిత్ర పుటలో రాహుల్ నిలుస్తారు

ABN , Publish Date - Nov 05 , 2024 | 09:00 PM

కుల గణనతో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలుస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అన్ని కులాల వారు సమానమని, అందరికీ సమాన అవకాశాలు రావాలని సంకల్పించారని గుర్తుచేశారు. కుల గణన చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటే కారణం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth Reddy: చరిత్ర పుటలో రాహుల్ నిలుస్తారు
Telangana CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు కారణం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కుల గణన చేపడతామని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని రాహుల్ గాంధీ కలిశారని, వారి బాధలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన చేపడుతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద మేధావులు, ప్రజా సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. కుల గణన గురించి సమావేశంలో చర్చించారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.


rahul gandhi.jpg


చరిత్రపుటల్లో

‘ఇందిరా గాంధీ మాదిరిగా రాహుల్ గాంధీ చరిత్ర పుటలో నిలుస్తారు. దేశంలో పేదలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇందిరా గాంధీ గరీబీ హఠావో అని పిలుపిచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కుల గణనకు శ్రీకారం చుట్టారు. ఇందిరా తర్వాత రాహుల్ చరిత్ర పుటల్లో నిలువనున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సామాజిక న్యాయం చేసేందుకు సంకల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం కుల గణనపై ముందుకు నడిచారు. కుల గణనకు కోర్టు చిక్కులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం కుల గణన చేపట్టింది. ఇదే అంశంపై ప్రధాని మోదీని నిలదీయాలి అని’ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


revanth1.jpg


అది రాహుల్ గొప్పతనం

‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించింది. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం గొప్ప విషయం. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారు. మాటలు కాదు, చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యం. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇందులో ఓసీలు-3076, ఈడబ్ల్యూఎస్- 2774, ఓబీసీలు-17,921,

ఎస్సీలు-4828, ఎస్టీలు-2783 ఉన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం.కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నాం అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..


Telangana-Deputy-CM-Bhatti-Vikramarka.webp


అందరికీ సమాన అవకాశాలు

‘రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం జనాభా లెక్కలు చేస్తున్నాం. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని సామాజిక న్యాయం చేస్తున్నాం. ఇచ్చిన మాటలను చేతలతో చేసి చూపించాలని రాహుల్ గాంధీ చెప్పారు అని’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ గుర్రమేంటీ ఇలా చేసిందీ.. స్కూటీపై వెళ్తున్న యువతులకు ఎలాంటి షాక్ ఇచ్చిందో చూడండి..

Swiggy IPO: రేపే స్విగ్గీ ఐపీఓ! మరి ఈ సంస్థను ముందుండి నడిపించేదెవరో తెలుసా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 09:10 PM