Share News

Justice Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:53 PM

తెలంగాణ విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.

Justice Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్‌ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు నియమించింది. లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్‌ 31న జన్మించారు. 1977, జూలై 28న న్యాయవాద వృత్తిని ఆయన ప్రారంభించారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిధులు నిర్వర్తించారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్‌‌ను నియమించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్‌ లోకూర్‌ ఒకరు.

బీఆర్‌ఎస్ (BRS) హయాంలో విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్‌‌కు కొత్త చైర్మన్‌ను నియమించింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడీషియల్ విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే, లోకూర్ మళ్లీ మొదటి నుంచి మొదటి నుంచి పలు కీలక అంశాలపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఏ ఏ అంశాలపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరిపారో ఆయా అంశాలపై విచారణనె లోకూర్ కొనసాగించనున్నారు.


యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ..

మరోవైపు, నిన్న అసెంబ్లీలో విద్యుత్ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు అక్రమాల లెక్కతేలాలని అన్నారు. దొరికిపోతామని అర్థమైనందునే.. మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కోరారని ఆరోపించారు. కానీ, విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్‌ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, ‘‘మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్నట్లుంది. జ్యుడీషియల్‌ విచారణ మేము అనలేదు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని అంశాల్ని ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేం నిరూపించుకుంటాం.. విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు.


వారే కోర్టుకెళ్లారు..

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి 260 ఇన్‌టూ 4, సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం, యాదాద్రి 4వేల విద్యుత్‌ ఒప్పందం బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడంపై వారు అడిగితేనే ఆమోదించాం. కమిషన్‌ సమన్లు ఇచ్చినప్పుడు తమ వాదనలు వినిపిస్తే వాళ్ల నిజాయితీ బయటకు వచ్చేది. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు అని కోర్టుకు వెళ్లారు. హైకోర్టు వారి వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్తే విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కమిషన్‌ చైర్మన్‌ పట్ల అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మార్చేందుకు ప్రభుత్వాన్ని సూచించింది. ఈ రోజు సాయంత్రంలోగా కొత్త చైర్మన్‌ను నియమిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.


జార్ఖండ్‌.. సూపర్‌ క్రిటికల్‌ టెండర్‌..

జార్ఖండ్‌లో 2400 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టుకు టెండర్‌ పిలిస్తే... కొరియన్‌ కంపెనీ, బీహెచ్‌ఈఎల్‌, ఇంకో కంపెనీ టెండర్‌లో పాల్గొన్నాయని, తెలంగాణలో అంచనాలకు ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చిన రోజే జార్ఖండ్‌ ప్రభుత్వం సూపర్‌ క్రిటికల్‌ టెండర్‌ పిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదే బీహెచ్‌ఈఎల్‌ 18శాతం తక్కువకు టెండర్‌ కోట్‌ చేసి అక్కడ పని దక్కించుకుందని పేర్కొన్నారు. 18శాతం తక్కువకు తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండగా 4 వేల మెగావాట్ల విద్యుత్‌ పవర్‌ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌కు అప్పజెప్పారని అన్నారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామన్నారని, కానీ.. టెండరు ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇప్పటి వరకు ఉత్పత్తి మొదలు కాలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

TS News: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2024 | 04:25 PM