TSTET: టెట్ నిర్వహణకు పచ్చ జెండా.. త్వరలోనే నోటిఫికేషన్..
ABN , Publish Date - Mar 14 , 2024 | 07:41 PM
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయి దరఖాస్తు స్వీకరణ జరుగుతున్నాయి. మరింత మంది డీఎస్సీ పరీక్ష రాయాలనే ఉద్దేశ్యంతో టెట్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతేడాది సెప్టెంబర్ లో నిర్వహించిన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) పేపర్-1లో 82,489 మంది అంటే 36.89 శాతం ఉత్తీర్ణత పొందగా.. పేపర్-2లో కేవలం 29,073 మంది (15.30) మాత్రమే అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్ ఇతర పోటీ పరీక్షల దృష్ట్యా సన్నద్ధత అంతగా జరగలేదని, అందువల్లనే టెట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారనే సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.