Share News

Group 1 aspirants: గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన..!

ABN , Publish Date - Oct 20 , 2024 | 07:57 AM

ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు.. కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి నిరసన తెలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల అభ్యంతరాలపై ..

Group 1 aspirants: గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన..!

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్నవేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలని, రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు.. కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి నిరసన తెలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల అభ్యంతరాలపై చర్చించి, పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పలువురు సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. గ్రూప్-1 బాధితుల అభ్యంతరాలపై నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతికి నిధులొస్తున్నాయ్‌!


జీవో-29పై అభ్యంతరాలు..

జీవో-29పై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలో మొదటి 50 మందిని మెరిట్‌లో, తరువాత 50 మందికి రిజర్వేషన్లు వర్తించే ప్రక్రియ ఇప్పటిరవకు కొనసాగుతుండగా.. మెరిట్‌లో సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటా సీట్లలో లెక్కించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో ఎంతోమంది అభ్యర్థులు నష్టపోతారని కొందరు చెబుతుండగా.. ప్రభుత్వం మాత్రం జీవో29తో ఎవరికి నష్టం ఉండదని చెబుతోంది. ఓవైపు గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా.. వారికి విపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి.

CM Revanth Reddy: నాడు కలవని వాళ్లు నేడు పిలుస్తున్నారు..


ప్రభుత్వ ప్రటనపై ఉత్కంఠ

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిఉంది. ఈక్రమంలో ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదాపై నిర్ణయం తీసుకుంటుందా లేదా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని చెబుతారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇపప్పటికే పరీక్ష నిర్వహణ కోసం పటిష్ట భద్రత ఏర్పాటుచేశామని పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడం, బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొనడంతో.. అభ్యర్థుల అభ్యంతరాలపై ఓసారి చర్చించాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చించిన మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చారని, దీనికి సంబంధించి పూర్తి వివరాలను మంత్రులు మీడియా ద్వారా ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇలా చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 20 , 2024 | 07:57 AM