Share News

TS Highcourt: ప్రణీత్ కస్టడీ సరైందే.. తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

ABN , Publish Date - Mar 21 , 2024 | 11:40 AM

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. నిన్న ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు ప్రణీత్‌ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

TS Highcourt: ప్రణీత్ కస్టడీ సరైందే.. తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్, మార్చి 21: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్ రావుకు (Former SIB DSP Praneet Rao) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు (Nampalli Court) కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న (బుధవారం) విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు (గురువారం) ప్రణీత్‌ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పును వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..


ప్రణీత్ పిటిషన్‌లోని అంశాలు...

కాగా.. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందంటూ ప్రణీత్‌ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని వెల్లడించారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలన్నారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారనా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని ప్రణీత్ రావు అన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని.. బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?


ఏడు రోజుల పాటు కస్టడీ

కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ఐదు రోజులుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్ రావును అధికారులు విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ప్రణీత్‌ను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గత శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 వరకు నిందితుడు పోలీసుల అదుపులో ఉండనున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావుపై సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని పెన్‌డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Hyderabad: బిల్లులు లేకుండానే మందుల క్రయవిక్రయాలు

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 12:57 PM