Share News

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దానిపై విచారిస్తాం..

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:07 PM

అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ..

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దానిపై విచారిస్తాం..
Allu Arjun

సంథ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. విచారణకు అంగీకరించిన జడ్జి అన్ని విషయాలపై విచారణ జరుపుతామన్నారు. పోలీసుల తీరుపై కూడా విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది. అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహారించిన తీరుపైనా విచారణ చేపడతమని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ ఉదయం అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నైట్ డ్రెస్‌లో ఉన్న అల్లు అర్జున్ దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడం, తాము వస్తామని చెప్పడంతో డ్రెస్ ఛేంజ్ చేసుకోకుండానే అల్జు అర్జున్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు వ్యవహారించిన తీరును చాలామంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నేరస్తుడిని చూసినట్లు చూడటం బాధాకరమని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనేది ఆసక్తిగా మారింది.


హైకోర్టులో క్వాష్ పిటిషన్

ఓ వైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపర్చగా మరోెవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 4గంటలకు క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసుల అరెస్ట్ విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 13 , 2024 | 04:09 PM