Share News

Ponnam: ఆ వివరాలు అవసరం లేదు.. కుల గణనపై మంత్రి పొన్నం సంచలన ప్రకటన

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:39 AM

Telangana: తెలంగాణలో కులగణనను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.

Ponnam: ఆ వివరాలు అవసరం లేదు.. కుల గణనపై మంత్రి పొన్నం సంచలన ప్రకటన
Minister Ponnam Prabahakar

హైదరాబాద్, నవంబర్ 6: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కోరారు. బుధవారం ఉదదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని.. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.

Secunderabad: బంధువులు.. కలిసికట్టుగా దొంగతనాలు



ఈ సర్వేకు పబ్లిక్ సహకరించాలని కోరారు. రాష్ట్రవ్యప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని.. సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు నియమించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకుపైగా ఎన్యుమరేటర్లు నియమించామని తెలిపారు. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్‌లో న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కొందరు ఈ సర్వేను రాజకీయం చేయాలని చూస్తున్నారని.. వారి మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు.

Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..



సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు తనను అడగాలన్నారు. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుందని తెలిపారు. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానిక మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరయ్యారు.


అత్యంత గోప్యంగా సమాచారం...

కాగా.. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై సమాచారాన్ని సేకరించనుంది సర్కార్. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే.. రాష్ట్ర పౌరులకు సంబంధించి కులాలవారీగా సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి.. తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేయడమే ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 75 ప్రశ్నలతో ప్రతి కుటుంబానికీ చెందిన సమాచారాన్ని ఎంపిక చేసిన ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచనున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..

Hyderabad: గోల్డ్‌ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 10:46 AM