Share News

CAT: ఐఏఎస్‌ల పిటిషన్‌పై కాట్‌లో విచారణ ప్రారంభం

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:59 AM

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఈనెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు కాట్‌లో పిటిషన్‌ వేశారు.

CAT: ఐఏఎస్‌ల పిటిషన్‌పై కాట్‌లో విచారణ ప్రారంభం
IAS Officers Pitition

హైదరాబాద్, అక్టోబర్ 15: ఐఏఎస్‌ అధికారులు (IAS Officers) దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (కాట్‌)లో (CAT) మంగళవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. తెలంగాణలో (Telangana) పలువురు ఐఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) రిపోర్ట్ చేయాలని డీఓపీటీ (DOPT)ఈనెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు కాట్‌లో పిటిషన్‌ వేశారు. దీనిపై ఈరోజు విచారణ మొదలైంది. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరారు.

ABN Group: లక్ష్యంగా హ్యాకర్ల దాడులు


తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అధికారులు వినతి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల బదిలీలపై కాట్ స్టే విధించిన విషయం తెలిసిందే. కాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో (Telangana High Court) డీవోపీటీ పిటిషన్ వేసింది. ప్రస్తుతం హైకోర్టులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల అంశం పెండింగ్‌లో ఉంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇటీవల అధికారుల బదిలీలపై డీవోపీటీ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 16 న అధికారులు రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశించింది. దీంతో ఐఏఎస్ అధికారులు కాట్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణను కాట్ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.


క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వీరే..

  • రోనాల్డ్ రోజ్ - టీజీ ఎనర్జీ శాఖ సెక్రటరీ

  • వాణి ప్రసాద్ - టీజీ టూరిజం సెక్రటరీ

  • వాకాటి కరుణ - టీజీ మహిళా శిశు శాఖ సెక్రటరీ

  • ఆమ్రపాలి - టీజీ జీహెచ్‌ఎంసీ కమిషనర్

  • సృజన - ఏపీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్


కాగా... ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్‌ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అదే రాష్ట్రానికి వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రిలీవింగ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పలువురు ఐఏఎస్‌ అధికారులు మళ్లీ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) హైదరాబాద్‌ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామని, కేంద్రం ఇచ్చిన అస్పష్ట ఆదేశాల (నాన్‌ స్పీకింగ్‌ ఆర్డర్‌)ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, గుమ్మడి సృజన, రొనాల్డ్‌రోస్‌.. క్యాట్‌లో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీరిలో సృజనను తెలంగాణకు కేటాయించగా.. ప్రస్తుతం ఆమె ఏపీలో పనిచేస్తున్నారు. మిగిలిన నలుగురిని ఏపీకి కేటాయించగా.. వారు తెలంగాణలో పనిచేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 12:03 PM