Share News

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:21 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మరో వ్యక్తి బైకుపై వచ్చాడు. చివరకు ఎలాగోలా మందుబాబును బైకు ఎక్కించుకుని, వెనుక కూర్చోబెట్టుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా..

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్న తరహాలో ఉంటుంది... మందుబాబుల నిర్వాకం. కొందరు మద్యం సేవించి చేసే పనులు అందరికీ చిరాకు తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బైకుపై కూర్చున్నాడు. మధ్యలో అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మరో వ్యక్తి బైకుపై వచ్చాడు. చివరకు ఎలాగోలా మందుబాబును (Drunken Man) బైకు ఎక్కించుకుని, వెనుక కూర్చోబెట్టుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఫుల్ కిక్కులో ఉన్న ఆ వ్యక్తి కాస్త దూరం వెళ్లేసరికి కనీసం సరిగ్గా కూర్చోలేకపోయాడు.

Viral Video: టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు.. చివరికి ఇలా అవుతుందని ఊహించలేకపోయాడు..


ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైకుపై కూర్చున్న అతను చూస్తుండగానే వెనక్కు వాలిపోయాడు. వాహనం నడుపుతున్న వ్యక్తి ఇదేమీ గమనించకుండా మెల్లగా ముందుకు వెళ్తున్నాడు. ఇంకాసేపటికి వెనక్కు వాలిన వ్యక్తి కాస్తా.. (Drunken man fell from bike) పూర్తిగా నేలపై పడిపోయాడు. అప్పటికి గమనించిన ఆ వ్యక్తి బైకును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగాడు. అతన్ని పైకి లేపి కూర్చోబెట్టాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ మందుబాబు ఇబ్బందులు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: యాక్షన్‌‌కి.. షాకింగ్ రియాక్షన్.. దంపతులను దోచువాలని చూడగా.. చివరికి ఏమైదంటే..


ఇదంతా వెనుక నుంచి గమనిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ మందుబాబుకు పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ సీన్ చూస్తుంటే మందు తాగాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైకులు, 5.71 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 11:21 AM