Share News

Thalasani: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jul 06 , 2024 | 06:51 PM

వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.

Thalasani: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలి
Talasani Srinivas Yadav

హైదరాబాద్: వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. ఈ నెల 9 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరగనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ఆలయ పరిసరాల్లో పర్యటించారు.

ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ.. ప్రతి ఏడాది నిర్వహించే అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.


ALSO Read: Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

2014కు ముందు అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వాహించేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ముందు, పక్కన రెండు భారీ రేకుల షెడ్లను నిర్మించి ఆలయం ముందు రేకుల షెడ్డు కింద అత్యంత ఘనంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ( లైవ్ టెలికాస్ట్) చేయడం జరిగిందని తెలిపారు.

అమ్మవారి కళ్యాణానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆలయ పరిసరాల్లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని, వారి అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనం సందర్బంగా భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.


శాంతి భద్రతల పర్యవేక్షణ లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లోని ప్రజలు కూడా అధికారులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. అమ్మవారి కళ్యాణం, రథోత్సవం జరిగే రెండు రోజులపాటు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ ఏసీపీ వెంకటరమణ, ఆర్ అండ్‌బీ ఈఈ రవీంద్ర మోహన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జీహెచ్ఎంసీ డీసీ జగన్, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, ఈవో అంజన కుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, ఆలయ కమిటీ సభ్యులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


అమ్మవారికి పోచంపల్లి వస్త్రాలు

ఈ నెల 9 వ తేదీన జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్బంగా అమ్మవారికి పోచంపల్లి చేనేత పట్టువస్త్రాలను సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో మగ్గంపై నేసిన వస్త్రాలను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆలయ ఈవో, చైర్మన్లకు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..

KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 07:07 PM