Share News

Mahesh goud: దేశ ప్రజల గుండెల్లో గాయమైంది

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:07 PM

Telangana: కేంద్రమంత్రి అమిత్‌షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు. అమిత్ షా‌ను సపోర్ట్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమైందన్నారు.

Mahesh goud: దేశ ప్రజల గుండెల్లో గాయమైంది
TPCC chief Mahesh Kumar Goud

హైదరాబాద్, డిసెంబర్ 24: దేశ ప్రజల గుండెల్లో గాయమైందని.. తమకు దైవ సమానమైన అంబేద్కర్‌ గురించి అమిత్ షా చులకనగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (TPCC Chief Mahesh kumar goud)ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం నాడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరబాద్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

DK Aruna: అల్లు అర్జున్‌పై వేధింపులకు కారణం అదే.. డీకే అరుణ సంచలన కామెంట్స్


ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ... రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు. అమిత్ షా‌ను సపోర్ట్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రపతి తలుపు కూడా తడతామన్నారు. అమిత్ షా మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తున్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే లాగా అమిత్ షా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతి అమలులోకి తేవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమొరాండం ఇచ్చామన్నారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని టీపీసీచీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారు.


అంబేద్కర్‌పై ద్వేషం బయటపడింది: కొప్పుల రాజు

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి అంబేద్కర్‌పై ఎంత ద్వేషం ఉందో బయటపడిందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. దేశ ప్రజలకు వచ్చిన అన్ని హక్కులు అంబేద్కర్ వల్లే వచ్చాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు. అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కొప్పుల రాజు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.


అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలి: భట్టి

bhatti-vikramarka.jpg

మరోవైపు ఖమ్మం జిల్లాలోనూ అమిత్ షా వాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించింది. నిరసన ర్యాలీలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంబేద్కర్ అవమానించిన, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నిండు సభలో ఈ దేశ రాజ్యాంగాన్ని దేశానికి మార్గదర్శకులుగా నిలిచిన అంబేద్కర్‌ను అవమానించిన అమీషాపై చర్యలు తీసుకోవాలన్నారు.


ప్రపంచంలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నదంటే అందుకు ఈ దేశ రాజ్యాంగమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ వంటి మహనీయులు.. ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు గర్వంగా తిరిగేలా స్వేచ్ఛగా జీవించేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కుల మతాలకతీతంగా ప్రాంతాలకు అతీతంగా నేడు దేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని.. ఇందుకు మన రాజ్యాంగమే ప్రధాన కారణమని చెప్పారు. ఈ హక్కులను కాల రాయాలని ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఈ దేశానికి హోం మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాపై వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు

పోలీస్ స్టేషన్‌కు పుష్ప

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 03:07 PM