Share News

Jaggareddy: ఎవ్వరినీ వదలా... మీడియాపై జగ్గారెడ్డి ఫైర్

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:27 PM

Telangana: మీడియాపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలెక్టర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. కొన్ని టీవీలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. వారందరిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Jaggareddy: ఎవ్వరినీ వదలా... మీడియాపై జగ్గారెడ్డి ఫైర్
TPCC Working President Jagga Reddy

హైదరాబాద్, అక్టోబర్ 26: మహిళా కలెక్టర్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (TPCC Working President Jaggareddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే తాను ఒకటి చెబితే పలు టీవీ ఛానళ్లు మరోటి ప్రసారం చేస్తున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. పలు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై విరుచుకుపడ్డారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. తనపై పలు టీవీలలో, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..


‘‘నేను గతంలో రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మగ కలెక్టర్‌ను ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పాను. కానీ కొన్ని టీవీలలో నేను మహిళ కలెక్టర్‌ను తిట్టినట్టు... బూతులు మాట్లాడినట్టు టీవీలలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను నేను ఏమీ అనలేదు. గత కలెక్టర్‌ను నేను మాటలు అన్నానని నేను చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు. వారికి అందరికీ లీగల్ నోటీసులు ఇస్తా’’ అని తెలిపారు. బీఆర్ఎస్ టీవీలతో పాటు ఇతర టీవీలలో తనపై చేసిన తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదని.. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదిలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Hyderabad: 'పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి ప్లీజ్'.. బెటాలియన్ పోలీసుల నిరసనల్లో తల్లి ఆవేదన


విషయం ఏంటంటే...

కాగా.. పదిసార్లు ఫోన్ చేసిన తన ఫోన్ ఎత్తకపోవడంతో కలెక్టర్‌ను తిట్టానంటూ జగ్గారెడ్డి ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశానని, కలెక్టర్ ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానని.. అంతేకాకుండా కలెక్టర్ భర్తతో పడుకుందా అని కూడా పీఏను ప్రశ్నించానని.. తనకు కోపం వస్తే ఇలాగే ఉంటుందని జగ్గారెడ్డి ప్రసంగించినట్లు వీడియోలో ఉంది. అయితే ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత కలెక్టర్‌ను ఉద్దేశించి కాదని.. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లపై వ్యాఖ్యలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో ఇద్దరు కలెక్టర్‌లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. వాళ్ళని తిట్టాను.. తప్పేంటి. నేను తిట్టింది గత ప్రభుత్వంలో... ఇప్పుడు కాదు’’ అంటూ జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు.


ఇవి కూడాచదవండి..

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 03:39 PM