VH: నాది కాంగ్రెస్ రక్తం.. టికెట్ ఇస్తే గెలిచినట్టే..: వీహెచ్
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:59 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదని, సీఎం పనిచేస్తున్నారు కాబట్టే సపోర్ట్ చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదని, సీఎం పనిచేస్తున్నారు కాబట్టే సపోర్ట్ చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) వి. హనుమంతరావు (V. Hanumantharao) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ.. తనది కాంగ్రెస్ రక్తమని, ఖమ్మం (Khammam) ఎంపీ టికెట్ (MP Ticket) కోసం కాంగ్రెస్ హై కమాండ్‌ను అడిగానన్నారు. ఒకేవేళ తనకు టికెట్ ఇవ్వకపోయినా తానేం తిరుగుబాటు చేయనని స్పష్టం చేశారు.
2019లోనే తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేశానని.. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ఆలోచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని వీహెచ్ చెప్పారు. ఖమ్మం నుంచి పోటీ చేయడం కోసం అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేశానన్నారు. తనకు టికెట్ ఇస్తే గెలిచినట్టేనని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikarmarka) తనను ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి, ఇప్పుడు తన భార్యకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా తన కోసం పని చేస్తామని అంటున్నారని చెప్పారు. సోషల్ ఇంజనీరింగ్ విషయంలో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయకుండా చూసుకోవాలని వి.హనుమంతరావు సూచించారు.