Share News

Prajabhavan: ప్రజాభవన్‌ ముందు ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు, మల్లారెడ్డి బాధితుల ఆందోళన

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:58 AM

Telangana: ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగారు. వీరు తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిరసన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు.

Prajabhavan: ప్రజాభవన్‌ ముందు ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు, మల్లారెడ్డి బాధితుల ఆందోళన

హైదరాబాద్, జనవరి 5: ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగారు. వీరు తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిరసన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వేనెంబర్ 647/1, 648& 654లో భూమిని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు.


అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి సర్వేనెంబర్ 648/650లో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపిస్తున్నారు. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికిపైగా బాధితులు తరలివచ్చారు. శ్రీ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేసారంటూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్య‌కు ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2024 | 11:40 AM