Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
ABN , Publish Date - May 02 , 2024 | 12:48 PM
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) వీడియో మార్ఫింగ్ కేసు (Video Morphing Case)లో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ (Congress) సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్ (Satish)తో పాటు నవీన్ (Navven), తస్లీమా (Taslima)ను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత (BJP Leader) ప్రేమేందర్ (Premender) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదైంది. కాసేపటి క్రితం (గురువారం) ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీపీఎస్‌కు తరలించారు.
కాగా రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్‌లో కోరింది.
సీనియర్ న్యాయవాది జయంత్ మెహతా బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్‌సింగ్ అరోరాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు. డీప్‌ఫేక్ వీడియోలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ స్పందించలేదన్నారు. ఎన్నికల వేళ చక్కర్లు కొడుతున్న డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషన్ సక్రమంగా ఉంటే గురువారం విచారణ చేపడతామని తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. కాగా.. ఈ కేసులో మే 1న హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే నాకు నోటీసులు ఇచ్చారు: రేవంత్ రెడ్డి
జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి
వైసీపీని పాతాళంలో కలపాలి: సత్యప్రసాద్
కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు
అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
గ్రాబింగ్ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!
నవ సందేహాలకు జగన్ జవాబివ్వాలి: షర్మిల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News