YS Sharmila: న్యూఇయర్ విషెస్‌తో పాటు కొడుకు పెళ్లి తేదీని ప్రకటించిన వైఎస్ షర్మిల
ABN , Publish Date - Jan 01 , 2024 | 01:20 PM
Telangana: తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు షర్మిల. అదే షర్మిల కుమారుడి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు.
హైదరాబాద్, జనవరి1 : తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి (YSRTP Chief YS Sharmila Reddy) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు షర్మిల. అదే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక తేదీ, పెళ్లి డేట్‌ను షర్మిల ప్రకటించారు.
‘‘ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది’’ అని చెబుతూ వైఎస్ షర్మిల తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...