Share News

IAS Officers: ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐఏఎస్‌లు

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:03 AM

క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు దారులన్నీ మూసుకుపోయాయి. ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్‌ చేయాల్సిందేనని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశించడం..

IAS Officers: ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐఏఎస్‌లు

  • తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు

  • వారి స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు

  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబరిది

  • ఏపీ నుంచి రాష్ట్రానికి ఇద్దరు ఐఏఎస్‌లు నేడు మరొకరి రాక

  • తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు దారులన్నీ మూసుకుపోయాయి. ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్‌ చేయాల్సిందేనని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశించడం.. హైకోర్టు కూడా అదే చెప్పడంతో తెలంగాణలోనే కొనసాగాలని శతవిధాలా ప్రయత్నించిన ఐఏఎ్‌సలకు చుక్కెదురైంది. దీంతో ఐఏఎ్‌సలు ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారు. డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా వీరిని రిలీవ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీలో పనిచేస్తూ తెలంగాణకు కేటాయించిన ముగ్గురు ఐఏఎ్‌సల్లో లోతేటి శివశంకర్‌, గుమ్మళ్ల సృజన బుధవారం సీఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీకి చెందిన మరో ఐఏఎస్‌ సి.హరికిరణ్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌, స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రోనాల్డ్‌ రోస్‌, స్త్రీశిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ప్రశాంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలిని విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ బుధవారం రాత్రి సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


  • జీహెచ్‌ఎంసీ కమిషన ర్‌గా ఇలంబరిది

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబరిదికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేస్తుండగా.. గ్రేటర్‌ బాఽధ్యతలు అదనంగా కట్టబెట్టారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సందీ్‌పకుమార్‌ సుల్తానియాకు ఇంధన శాఖ కార్యదర్శిగా, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రిస్టినా జడ్‌ చోంగ్తుకు ఆయుష్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్‌.శ్రీధర్‌కు యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్కియాలజీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న టీకే శ్రీదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వైద్యఆరోగ్యశాఖ సంచాలకుడిగా పనిచేస్తున్న ఆర్‌.వి.కర్ణన్‌కు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్‌ జీవో జారీ చేశారు.


  • ఆయనతో పాటే ఆమె..

ఐఏఎస్‌ రోనాల్డ్‌రోస్‌ ఏపీకి వెళ్తుండడంతో ఆయన సతీమణి, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ అధికారిణి విశాలాచ్చిని ఆరోగ్యశ్రీ సీఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆమె డిప్యుటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్నారు.


  • ఐపీఎ్‌సలపై నేడో, రేపో ఉత్తర్వులు!

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించిన ఐపీఎ్‌సల విషయంలో ఒకట్రెండు రోజుల్లో కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐపీఎస్‌ అధికారులు అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఐపీఎ్‌సలు ఏపీలో రిపోర్ట్‌ చేయాలని గత వారమే డీవోపీటీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, అవి డీవోపీటీ నుంచి నేరుగా కేంద్ర హోం శాఖకు వెళ్లాయి. అక్కడ పరిశీలన పూర్తి కావడంతో ఒకటి, రెండు రోజుల్లో రిలీవింగ్‌ ఉత్తర్వులు సీఎ్‌సకు అందనున్నాయి.

Updated Date - Oct 17 , 2024 | 03:03 AM