Share News

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:14 AM

పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్‌మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి!

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

కంది, ఆగస్టు 22: పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్‌మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి! గాలిలో ఎగురుతూ మనుషులు చేరలేని చోటుకు బరువైన వస్తువులు తీసుకెళతాయి! ఇవి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) పరిశోధకులు తయారుచేస్తున్న డ్రోన్లు! సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్‌లోని ‘టీహాన్‌’ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఇన్‌ అటానమస్‌ నావిగేషన్‌) విభాగం టెక్నాలజీ ఈ ఫ్లాపింగ్‌ వింగ్స్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా గాల్లోకి ఎగురవేసి పరీక్షించింది.


ఇవి కొండలు, గుట్టలపైన, అటవీ ప్రాంతాల్లో జీపీఎ్‌సతో నిర్దేశిత లక్ష్యానికి చేరగలవు. వీటి మార్గంలో ఏవైనా అడ్డం వస్తే సెన్సార్లు పసిగడతాయి. ఆటోమేటిక్‌గా ఆ డ్రోన్‌ తిరిగి మళ్లీ ఆపరేటర్‌ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఈ టెక్నాలజీలో సహకారం అందించేందుకు కొన్ని స్టార్టప్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ డ్రోన్లకు ధరలు నిర్ణయించి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఐఐటీహెచ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు భూ సర్వే చేసే డ్రోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇవి దేశంలో తొలి సర్వే డ్రోన్లుగా డీజీసీఏ (డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌) సర్టిఫికెట్‌ పొందాయి.

Updated Date - Aug 23 , 2024 | 03:14 AM