Share News

Weather: బాబోయ్ చలి.. ఈ ప్రాంత వాసులకు చుక్కలే ఇక..

ABN , Publish Date - Nov 20 , 2024 | 09:53 PM

Telangana Weather Update: దేశ వ్యాప్తంగా చలి తీవ్రంగా పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.

Weather: బాబోయ్ చలి.. ఈ ప్రాంత వాసులకు చుక్కలే ఇక..
Telangana Weather

Telangana Weather Update: దేశ వ్యాప్తంగా చలి తీవ్రంగా పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సిర్పూర్ 10.5 డిగ్రీలు, పొచ్చెర 11.8, కుంటాల 12.6, ర్యాలీ 13.1 డిగ్రీలు చొప్పున రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో చలి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. చలి తీవ్రత కారణంగా.. చిరు వ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందది పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు.


ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు అవుతాయని చెప్పారు. ఈ కారణంగానే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ప్రకటించారు.


వీరు జాగ్రత్త..

రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండటంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వృద్ధులు, చిన్న పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. అలాంటి ప్రజలకు అధికారులు కీలక సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఆదిలాబాద్‌ - 12.7

2. భద్రాచలం - 19

3. హకీంపేట - 15

4. దుండిగల్ - 14.4

5. హన్మకొండ - 15.5

6. హైదరాబాద్ - 15.8

7. ఖమ్మం - 21.0

8. మహబూబ్‌నగర్ - 18.9

9. మెదక్ - 12

10. నల్గొండ - 20

11. నిజామాబాద్ - 15

12. రామగుండం - 15.9

13. పటాన్‌చెరు - 12.4

14. రాజేంద్రనగర్ - 13.5

15. హయత్‌నగర్ - 15.6

Updated Date - Nov 20 , 2024 | 09:53 PM