Jangaon: : జనగామ జిల్లాలో పాక్షికంగా తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం..
ABN , Publish Date - Jul 06 , 2024 | 03:19 AM
జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం ఘటన అగ్గి రాజేసింది. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతులు లేవంటూ గురువారం రాత్రి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం.. రాస్తారోకో
దేవరుప్పుల, జూలై 5: జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం ఘటన అగ్గి రాజేసింది. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతులు లేవంటూ గురువారం రాత్రి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్థులు గొడవ చేయడంతో విరమించుకున్నారు. కానీ అప్పటికే విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జనగామ-సూర్యాపేట రహదారిపై మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశాలతో విగ్రహాన్ని అధికారులు కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. విగ్రహం కూల్చివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.