Share News

Junior Colleges: ఇంటర్‌ ప్రవేశాల గడువు సెప్టెంబరు 7 దాకా పెంపు

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:08 AM

రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు శుక్రవారం తెలిపింది.

Junior Colleges: ఇంటర్‌ ప్రవేశాల గడువు సెప్టెంబరు 7 దాకా పెంపు

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు శుక్రవారం తెలిపింది. 2024- 25 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, కో-ఆపరేటివ్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, కాంపోజిట్‌ డిగ్రీ, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది.


ఈ గడువులోగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఇంటర్మీడియట్‌ బోర్డు అనుబంధ (అఫిలియేటెడ్‌) కళాశాలల్లోనే చేరాలని విద్యార్థులకు సూచించింది. అనుబంధ కళాశాలల జాబితా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉందని తెలిపింది.

Updated Date - Aug 31 , 2024 | 04:08 AM