Share News

TS Politics: నేను హిందువునే.. ఆయన నాస్తికుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 10 , 2024 | 08:28 PM

బీఆర్ఎస్(BRS) నేతలకు సిగ్గులేదని.. ఇక వాళ్లు మారరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు.

TS Politics: నేను హిందువునే.. ఆయన నాస్తికుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్

కరీంనగర్: బీఆర్ఎస్(BRS) నేతలకు సిగ్గులేదని.. ఇక వాళ్లు మారరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. శనివారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని విమర్శించారు. ‘‘నేను హిందువునేనని.. హిందు ధర్మ గురించే చెప్తాను. వినోద్ కుమార్ దేవుణ్ణి నమ్మరు..నాస్తికుడు’’ అని బండి సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలకు కళ్లు కనబడటం లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు దోచి పెట్టడానికే వినోద్ గతంలో ఎంపీ అయ్యారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కాళేశ్వరంలో వినోద్ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లు కాదా అని ప్రశ్నించారు. వినోద్ ఎంపీగా ఉండి కరీంనగర్‌కు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. వినోద్‌ది కరీంనగర్ కాదని... తనది పక్కా లోకల్ అని బండి సంజయ్ అన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 08:31 PM