BJP: పొత్తులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 12 , 2024 | 10:45 AM
కరీంనగర్: పొత్తులపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని..
కరీంనగర్: పొత్తులపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖకత్వపు పార్టీ తమది కాదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకునే దమ్ము బీఆర్ఎస్‌కు లేదని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎన్నికల్లో బీఆర్ఎస్‌ది మూడో స్థానమేనని, మూడో స్థానానికి వెళ్లే పార్టీతో పది స్థానాలు గెలిచే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ అన్నారు.